
హనుమకొండసిటీ, వెలుగు: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, రాష్ర్ట పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ను హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ లో కలిశారు.
నాయినిని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీ పదవుల ఇన్చార్జిగా నియమించినట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీ పదవులపై పీసీసీ చీఫ్, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జిలతో ఎమ్మెల్యే చర్చించినట్లు తెలిసింది. ఆయనవెంట ఉమ్మడి జిల్లా నాయకులు తదితరులు ఉన్నారు.