సూరమ్మ ప్రాజెక్టు శిలాఫలకానికి దిష్టి తీసిన కాంగ్రెస్ నేతలు

సూరమ్మ ప్రాజెక్టు శిలాఫలకానికి దిష్టి తీసిన కాంగ్రెస్ నేతలు

జగిత్యాల జిల్లాలో సూరమ్మ ప్రాజెక్ట్ నిర్మాణ పనుల కోసం కథలాపూర్ మండలం కలికోట గ్రామంలో వేసిన శిలాఫలకానికి దిష్టి తీసి, నిరసన తెలిపారు కాంగ్రెస్ నాయకులు. శిలాఫలకం వేసి నేటితో 5 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిరసన తెలిపారు. 5 గుమ్మడి కాయలు, 5 కొబ్బరి కాయలు, 5 జీడీ గింజలు, 5 నిమ్మ కాయలు, 5 మిరుపకాయలతో శిలాఫలకానికి రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ అధ్యక్షులు ఆది శ్రీనివాస్.. తమ పార్టీ నేతలతో కలిసి దిష్టి తీశారు. 

అనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావు (ప్రస్తుతం వైద్య, ఆర్థికశాఖలు) వేములవాడను కోనసీమను చేస్తానని హామీ ఇచ్చి మరిచిపోయాడంటూ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్, ఎమ్మెల్యే రమేష్ బాబు దిష్టి పోయి.. సూరమ్మ ప్రాజెక్టు నిర్మాణ పనులు వెంటనే పూర్తి కావాలన్నారు కాంగ్రెస్ నాయకులు. సూరమ్మ ప్రాజెక్టు కోసం ప్రతి నెల 22వ తేదీన  కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. 

ALSO READ: టెస్ట్ క్రికెట్‌లో 'బజ్ బాల్' అంటే ఏంటి? ఆ పేరెందుకు వచ్చింది?