నిర్మలా సీతారామన్ టూర్ లో ఉద్రిక్తత

నిర్మలా సీతారామన్ టూర్ లో ఉద్రిక్తత

కామారెడ్డి జిల్లాలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ టూర్ లో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నేతలు కేంద్రమంత్రిని అడ్డుకునేందుకు యత్నించారు . కాన్వాయ్ కు ఎదురుగా వెళ్లేందుకు యత్నించడంతో కాంగ్రెస్ నేతలను  బీజేపీ లీడర్లు అడ్డుకున్నారు . దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కర్రలతో దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు రెండు పార్టీల నేతలను అక్కడి నుంచి పంపించారు.

కామారెడ్డి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఇవాళ‌ ఉదయం బాన్సువాడకు చేరుకున్న కేంద్రమంత్రి.. మండలంలోని కొయ్యగుట్ట అమరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు.  ఆపై బాన్సువాడ పట్టణంలోని బీజేపీ కార్యకర్త తుప్తి ప్రసాద్ ఇంట్లో  నిర్మల సీతారామన్ అల్పాహారం చేశారు. లోక్‌సభ ప్రవాస్ యోజనలో భాగంగా బాన్సువాడ నియోజకవర్గంలో కేంద్రమంత్రి  పర్యటిస్తున్నారు. బీర్కూర్ మండల కేంద్రంలో రేషన్ షాప్‌కు వెళ్లి లబ్దిదారులతో మాట్లాడనున్నారు. అనంతరం  కోటగిరి వెళ్లి వాక్సినేషన్ సెంటర్‌ను పరిశీలించనున్నారు. రుద్రుర్‌లో ప్రజా ప్రతినిధుల సమావేశం .. తరువాత వర్ని మండల కేంద్రంలో ఐటీ వింగ్‌తో సమావేశంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొనున్నారు.