ప్రతిపక్షాల మీటింగ్ పెట్టిన కాంగ్రెస్.. పలు పార్టీలు దూరం

ప్రతిపక్షాల మీటింగ్ పెట్టిన కాంగ్రెస్.. పలు పార్టీలు దూరం

ఢిల్లీ: కాంగ్రెస్ నేతృత్వంలో  పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై  జరుగుతున్న విపక్షాల సమావేశం సోమవారం మధ్యాహ్నం మొదలైంది. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు , సీఏఏపై పలు నగరాల్లో వ్యక్తమవుతున్న ఆందోళనల గురించి చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ ఈ మీటింగ్ ను ఏర్పాటు చేసింది.

ఈ సమావేశానికి  కీలకమైన తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ పార్టీల అధినేత్రులు మమతా బెనర్జీ, మాయావతి గైర్హాజరు అయ్యారు.  అదే సమయంలో  ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, తనను ఈ సమావేశానికి ఆహ్వానించలేదని చెబుతూ, తాను వెళ్లడం లేదని స్పష్టం చేశారు. శివసేన నాయకుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు.