
- 6న మంత్రి వివేక్‌కు పౌరసన్మానం
- కాంగ్రెస్, మాల మహానాడు నేతలు
గోదావరిఖని, వెలుగు: కార్మిక పక్షపాతి, మాజీ కేంద్ర మంత్రి దివంగత వెంకటస్వామి(కాకా)కి భారతరత్న ఇవ్వాలని లీడర్లు బాబర్ సలీంపాష, గుమ్మడి కుమారస్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడుతూ ఏడు సార్లు ఎంపీగా గెలిచిన కాకా దేశవ్యాప్తంగా 101 కార్మిక సంఘాలకు నాయకత్వం వహించారన్నారు. హైదరాబాద్‌లో 75 వేల మందికి ఇండ్ల పట్టాలు ఇప్పించిన ఘనత ఆయనదన్నారు. రామగుండం సింగరేణి ప్రాంతంలోనూ సుమారుగా 18 వేల ఇండ్ల పట్టాలు ఇప్పించడంలో చొరవచూపారన్నారు.
ఎన్టీపీసీలో 4 వేల మెగావాట్ల ప్లాంట్ఏర్పాటు కోసం పీకే రామయ్య క్యాంప్‌లో నివాసముండే వారిని సురక్షిత ప్రాంతానికి తరలించి 400 మందికి ఇండ్ల పట్టాలు ఇప్పించారని, వారు ఇండ్లు కట్టుకునేందుకు విశాక ఇండస్ట్రీ నుంచి ఉచితంగా రేకులు అందజేశారని తెలిపారు. ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన కాకా వెంకటస్వామికి భారత రత్న ఇవ్వాలని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పరిశీలన చేయాలని వారు కోరారు. ఆయన కొడుకు వివేక్ వెంకటస్వామి కూడా ఎంపీగా ఉన్న సమయంలో మూతపడ్డ రామగుండం ఎరువుల
ఫ్యాక్టరీని తిరిగి తెరిపించేందుకు విశేష కృషి చేశారన్నారు. ఇటీవల కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వివేక్ వెంకటస్వామికి ఈ నెల 6న గోదావరిఖని మార్కండేయకాలనీలోని పౌర సన్మానం చేయనున్నట్లు చెప్పారు. ప్రెస్ మీట్‌లో లీడర్లు, వివేక్ అభిమానులు పాకాల గోవర్ధన్‌రెడ్డి, మల్లికార్జున్‌గౌడ్, మల్లేశ్‌యాదవ్, కోటేశ్వర్లు, మల్లేశ్, సంజీవ్, జావెద్, నర్సింగ్దొర, మధు, తిరుపతి, దీపక్, సదానందం యాదవ్, విజయ్‌మోహన్, వెంకటేశ్వర్లు, కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.