మండల కాంగ్రెస్​ అధ్యక్షుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

మండల కాంగ్రెస్​ అధ్యక్షుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

ఇల్లెందు, వెలుగు : గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పులి సైదులును ఆదివారం ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆయన స్వగృహనికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పులి సైదులు త్వరగా కోలుకొని రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని కోరారు.

 ఎమ్మెల్యే వెంట పట్టణ అధ్యక్షుడు దొడ్డ డానియల్, ఎంపీటీసీ పూనెం సురేందర్, పాయం కృష్ణ ప్రసాద్, నాయకులు మడుగు సాంబ మూర్తి, లక్ష్మణ్ పాల్గొన్నారు.