రాష్ట్రపతి ముర్ముకు ఎమ్మెల్యే సీతక్క వినతిపత్రం

రాష్ట్రపతి ముర్ముకు ఎమ్మెల్యే సీతక్క వినతిపత్రం

మేడారం మహా జాతరను నేషనల్ ఫెస్టివల్ గా ప్రకటించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. జాతరకు కేంద్ర ప్రభుత్వం  ప్రత్యేక నిధులను కేటాయించాలని కోరారు. రామప్ప సందర్శన కోసం ములుగు జిల్లాకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎమ్మెల్యే సీతక్క కలిశారు. పలు ప్రజా సమస్యలపై రాష్ట్రపతికి  వినతిపత్రం సమర్పించారు.  మేడారం మహాజాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని కోరారు. దీనికి కేంద్రం నిధులను కేటాయిస్తే.. స్థానికంగా అభివృద్ధి ఊపందుకుంటుందని చెప్పారు.

2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం  పోడు భూములకు పట్టాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్ గఢ్, తెలంగాణ అటవీ అధికారుల మధ్య ఆదివాసీలు, గొత్తి కోయలు నలిగిపోతున్నారని.. వారికి సంబంధించిన పోడు భూముల సమస్యను పరిష్కరించాలన్నారు. అనంతరం మీడియాతో సీతక్క మాట్లాడుతూ.. తాను చేసిన వినతులపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సానుకూలంగా స్పందించారని చెప్పారు.