కేసీఆర్‌కి మెమోరీ లాస్ అవుతోంది.. పాత రికార్డులు చూడండి సారూ..

 కేసీఆర్‌కి మెమోరీ లాస్ అవుతోంది.. పాత రికార్డులు చూడండి సారూ..

సీఎం కేసీఆర్ పాలనపై  తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి . కేసీఆర్‌కి మెమోరీ లాస్ స్టార్ట్ అయింది. కేసీఆర్ జ్ఞాపక శక్తి కోల్పోయాడు. కేసీఆర్ ఏమేం మాట్లాడాడో గుర్తు రావాలంటే పాత వీడియో రికార్డులు చూడాలి అంటూ జీవన్ రెడ్డి సలహా ఇచ్చారు. దళితులు, బలహీన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన భూములను కేసీఆర్ లాక్కొని అమ్మకానికి పెడుతున్నాడంటూ జీవన్ రెడ్డి ఆరోపించారు.

 రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూరేందుకు 111 జీవోన రద్దు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.111 జీవో పరిధిలో ఫాంహౌజ్ కట్టుకుంటేనే పెద్ద లీడర్ అనేలాగా పరిస్థితి తయారైందని, బీఆర్ఎస్ నాయకులు ఫామ్‌హౌజ్‌లు కట్టుకోవడానికే తెలంగాణ వచ్చినట్టు ఉందంటూ జీవన్ రెడ్డి విమర్శలు చేశారు. సోమేష్ కుమార్ రావడంతోనే 111 జీవో రద్దు అన్నారు. 111జీవో పరిధిలో 30వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆరు నెలల్లో తెలంగాణని వీలైనంత అమ్మడమే కేసీఆర్ లక్ష్యంగా కనిపిస్తోంది అంటూ ఆరోపించారు.

 తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలతో ఈ నెల 24 రాహుల్ గాంధీ సమావేశమవుతారని తెలిపారు.  కొత్తవారు పార్టీలోకి వస్తే పాతవారు ఇబ్బంది పడతారని ఆయన అన్నారు. Brs పార్టీ దళితులకు ఏమీ చేయలేదని విమర్శించారు.   

2వేల నోట్ల రద్దుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. తాను 2వేల నోటు చూడక రెండు మూడు నెలలు అవుతోంది. తాను ఎప్పుడు ఏటీఏంకి వెళ్లి డబ్బులు డ్రా చేసినా 500 నోట్లే వస్తున్నాయి. 2వేల ఎక్కడికి చేరాలో అక్కడికి చేరిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.