అంబేద్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ ఎంపీల ధర్నా

 అంబేద్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ ఎంపీల ధర్నా
  • కేసీఆర్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి

రాజ్యాంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా పార్లమెంట్ లోని అంబేద్కర్ విగ్రహం ముందు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ధర్నాచేశారు. టీపీసీసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ధర్నాలో పాల్గొన్నారు. సేవ్ రాజ్యాంగం, కేసీఆర్ ను శిక్షించండి అంటూ ప్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...  సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని, అలాంటి వ్యక్తికి సీఎంగా ఉండే అర్హత లేదన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను కేసీఆర్ అవమానించారన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ స్పందించి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం:

కౌలు రైతులకు 'రైతు బంధు' ఇవ్వాలి

వైరల్ అవుతున్న ‘శ్రీవల్లి’ ఇంగ్లిష్ వెర్షన్