మా మేనిఫెస్టోపై ఫీడ్ బ్యాక్ ఇవ్వండి: రాహుల్ గాంధీ

మా మేనిఫెస్టోపై ఫీడ్ బ్యాక్ ఇవ్వండి: రాహుల్ గాంధీ
  • కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ 

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల కోసం తమ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోపై ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆదివారం రాహుల్ గాంధీ ఇన్​స్ట్రాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘‘నేను ఈ వీడియోను గత అర్ధరాత్రి రూపొందించా. కానీ, ఆ టైంలో పోస్ట్ చేయడం సరికాదని ఇప్పుడు చేశా.

కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రతి భారతీయుడి గొంతుక. అందులో మీకు నచ్చిన, నచ్చని విషయం చెప్పండి. మీ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకోండి” అని కోరారు. ఈ మేనిఫెస్టో విప్లవాత్మకమైనదని చాలామంది ప్రజలు అభిప్రాయపడ్డారని పేర్కొన్నారు. కాగా, ‘పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారంటీ’ పేరుతో శుక్రవారం లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది.