
లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ప్రచార అస్త్రం రాఫెల్జెట్నమూనా ఇది. ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీ ఆఫీసు ఎదురుగా కొలువుతీరింది. కాంగ్రెస్‌పార్టీ రాఫెల్బొమ్మను పెట్టుకోవడమేంటని డౌట్వచ్చిందికదా! అదేంటంటే.. ఢిల్లీలోని అక్బర్రోడ్లో కాంగ్రెస్ఆఫీసు ముందు ఎయిర్చీఫ్మార్షల్బీఎస్ధనోవా అధికారిక నివాసం ఉంది. ఆ ఇంటిముందు గతంలో సుఖోయ్ఎస్యూ 30 ఫైటర్జెట్నమూనా ఉండేది. ప్రధానిగా మోడీ రెండోసారి ప్రమాణం చేసిన తెల్లారే ఈ విమానాన్ని తీసేసి రాఫెల్జెట్మోడల్ను ఏర్పాటు చేశారు. కావాలని చేశారో, యాదృచ్ఛికమో కానీ ఆ విమానం కాంగ్రెస్‌పార్టీ ఆఫీసుకు గురిపెట్టినట్లుంది. దీంతో నమూనా ఏర్పాటు కాస్తా వివాదంగా మారింది. ఇది పుండుమీద కారం చల్లినట్లే ఉందనే కామెంట్స్వినబడుతున్నాయి.