నిజాం షుగర్స్ ఆస్తులను కవిత కొనాలనుకుంది : జీవన్ రెడ్డి

నిజాం షుగర్స్ ఆస్తులను కవిత కొనాలనుకుంది : జీవన్ రెడ్డి

ఎడపల్లి, వెలుగు: నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆస్తులు కొనుగోలు చేయడానికే మాజీ సీఎం కూతురు కవిత ఫ్యాక్టరినీ మూసివేయించారని కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఎడపల్లి మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ... గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ లోగా నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రానున్న ఆగస్టు 15 లోగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ, వరి ధాన్యానికి రూ. 500 బోనస్ ఇవ్వనున్నామని చెప్పారు. 

సిద్దాపూర్​ లిప్టును రైతులు కూల్చుతారు.

బోధన్ నియోజకవర్గ రైతాంగం నిజాంసాగర్​, అలీసాగర్​ ఎత్తిపోతల పథకాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని,  కానీ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​ రెడ్డి, కేసీఆర్‌‌ కలిసి బోధన్​ రైతాంగానికి సాగునీటి కొరత సృష్టించడానికి  నిజాంసాగర్​ కాలువ పై సిద్దాపూర్​ లిప్టును నిర్మిస్తున్నారని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విమర్శించారు.

ఈ లిప్టు తో బోధన్ రైతాంగానికి సాగు నీటి కొరత ఏర్పడితే ఆ లిప్టును ఇక్కడి రైతాంగం కూల్చ డానికి సిద్ధంగాఉన్నారని హెచ్చరించారు. జడ్పీ వైస్ చైర్ పర్సన్ రజితా యాదవ్, ఉర్దూ అకాడమీ చైర్మన్ సాహెర్ బిన్ హంధాని, మాజీ ఎమ్మెల్సీఅరికెల నర్సరెడ్డి, కాంగ్రెస్​ పార్టీ మండల అద్యక్షుడు పులి శ్రీనివాస్ రావు పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.