దళితబంధు లొల్లితో మాకేం సంబంధం అన్న కాంగ్రెస్ పార్టీ

దళితబంధు లొల్లితో మాకేం సంబంధం అన్న కాంగ్రెస్ పార్టీ

టేక్మాల్, వెలుగు :  బీఆర్ఎస్ నేతల గ్రూపు తగాదాలతో బయటపడిన దళితబంధు లొల్లిని కాంగ్రెస్ పార్టీపై రుద్దడం కరెక్ట్​కాదని టేక్మాల్​మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నిమ్మ రమేశ్ చెప్పారు. బుధవారం ఆయన టేక్మాల్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. అందోలు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ఆయన సోదరుడు రాహుల్ కిరణ్ రెండో విడత దళిత బంధు ఇస్తామంటూ పాల్వంచ గ్రామానికి చెందిన నలుగురి వద్ద రూ.12 లక్షలు తీసుకున్నారంటూ బీఆర్ఎస్ కు చెందిన భూమయ్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని తెలిపారు.

చిల్లర రాజకీయాలు చేయడం బీఆర్ఎస్ పార్టీకి అలవాటేనన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్​ఓటమిని జీర్ణించుకోలేక, మంత్రి దామోదర్ రాజనర్సింహపై లేనిపోని ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఆయన వెంట కాంగ్రెస్​నేతలు మల్లారెడ్డి, సత్యనారాయణ, సుధాకర్, రాంచందర్, సాగర్, కిశోర్ ఉన్నారు.