నర్సాపూర్ జి, వెలుగు: జూబ్లీహిల్స్లో కాంగ్రెస్50 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు, సమతా ఫౌండేషన్‌చైర్మన్, గొల్లమడ గ్రామానికి చెందిన సమతా సుదర్శన్ అన్నారు.
శనివారం ఆయన రాష్ట్ర కార్మిక, మైనింగ్‌శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి జూబ్లీహిల్స్నియోజకవర్గంలోని షేక్‌పేట్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మంత్రి వివేక్‌వెంకటస్వామికి ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వడంతోనే కాంగ్రెస్ గెలుపు ఖాయమైందని అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు.
