‘స్థానిక’ ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా పనిచేయాలి : కంది శ్రీనివాస్ రెడ్డి

‘స్థానిక’ ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా పనిచేయాలి : కంది శ్రీనివాస్ రెడ్డి

ఆదిలాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని కాంగ్రెస్ ఆదిలాబాద్​ నియోజకవర్గ ఇన్​చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి సూచించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఆదిలాబాద్ రూరల్, సాత్నాల, మావల మండలాల కార్యకర్తలతో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. పోటీకి సిద్ధంగా ఉండే ఆశావ‌హులకు ఆయా ప్రాంతాల్లో ఉన్న బ‌లాబ‌లాల‌పై  స‌మీక్షించారు. ఆశావ‌హుల పేర్లు పరిశీలించి అధిష్టానం సూచ‌న‌ల‌తో తుది జాబితా ఖ‌రారు చేస్తామ‌న్నారు.  

ఎవ‌రికి టికెట్ ల‌భించినా అంతా క‌లిసికట్టుగా స్థానిక ఎన్నిక‌ల్లో ప‌నిచేయాలని సూచించారు. అనంతరం బీఆర్ఎస్​కు చెందిన మాజీ ఎంపీటీసీ అమ్ముల రమేశ్​తో పాటు జందాపూర్​కు చెందిన యువత కాంగ్రెస్​లో చేరగా వారికి శ్రీనివాస్​రెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు. సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, ఆనందరావు, భూపల్లి శ్రీధర్, శ్రావణ్ నాయక్, ఉయిక ఇందిర, శ్రీలేఖ, కొండ గంగాధ‌ర్, గుడిపల్లి నగేశ్, బండారి స‌తీశ్ పాల్గొన్నారు.