జస్టిస్ ఫర్ మూసేవాలా.. కాంగ్రెస్, బీజేపీ నిరసనలు

జస్టిస్ ఫర్ మూసేవాలా.. కాంగ్రెస్, బీజేపీ నిరసనలు

పంజాబీ ర్యాప్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యపై సోమవారం పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల్లో నిరసనలు పెల్లుబికాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది. ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు. మాన్ సర్కార్ ను రద్దు చేయాలని పంజాబ్ బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. పంజాబ్ లో పప్పెట్ ప్రభుత్వం ఉందని, ఈ సెన్సిటివిటీ సీఎంలు భగవంత్ కు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లకు తెలియదని, ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని పంజాబ్ బీజేపీ చీఫ్ గవర్నర్ తో భేటీలో కోరారు. మూస్ వాలా భధ్రతను ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు. ఈ హత్యను రాజకీయ హత్యగా పేర్కొంటోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసం ఎదుట కూడా నిరసనకారులు బైఠాయించారు. జస్టిస్ ఫర్ మూసేవాలా అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు ఆయన అభిమానులు.


మూసేవాలా తండ్రి బాల్ కౌర్ సింగ్.. తన కుమారుడి మృతిపై సీబీఐ, NIA దర్యాప్తుకు ఆదేశించాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ కు లేఖ రాశారు. అలాగే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. దీనికి ప్రభుత్వం అంగీకరించింది. మరోవైపు.. మూసేవాల ప్రయానించిన వాహనం నుంచి ఫోరెన్సిక్ అధికారులు ఆధారాలు సేకరించారు. ఇాదిలా ఉంటే..మూసేవాలాను చంపిన వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ లో సింగర్ వాహనం వెనుక మరో రెండు వాహనాలు ఫాలో చేసినట్లు గుర్తించారు. మూసేవాలా కారుపై 46 రౌండ్ల కాల్పులు జరిగినట్లు ఐడెంటిఫై చేశారు పోలీసులు. ఫోరెన్సిక్ టీం కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించింది. 
 



మరిన్ని వార్తల కోసం : -
పుణె డిఫెన్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్


HDFC అకౌంట్స్‌‌లో కోట్లాది రూపాయలు