తెలంగాణలో రాహుల్‌, ప్రియాంక పర్యటన.. షెడ్యూల్ ఇదే

తెలంగాణలో రాహుల్‌, ప్రియాంక  పర్యటన..  షెడ్యూల్ ఇదే

తెలంగాణలో55 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ ప్రచారానికి సిద్దమవుతుంది. ఆ పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఎంపీ రాహుల్ గాంధీ,  జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు.  2023 అక్టోబర్ 18,19,20 తేదీల్లో రాహుల్‌, ప్రియాంక పర్యటన కొనసాగనుంది.  

ఈ విషయలను రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే తెలిపారు.  ములుగు నుంచి కాంగ్రెస్‌ బస్సు యాత్ర ఉంటుందని,  పెద్దపల్లిలో భారీ బహిరంగ సభ జరగనుందని వీటిలో రాహుల్,  ప్రియాంక పాల్గొననున్నారని వెల్లడించారు.   అక్టోబర్ 18న జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో రాహుల్ గాంధీ ప్రత్యేక పూజలు చేయనున్నారు.  

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ 55 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది.  వామపక్షాలతో పొత్తుపై, మిగిలిన స్థానలపై మరో రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.  బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ  పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు ఫస్ట్ లిస్టులో చోటు దక్కకపోవడం గమనార్హం.  

ALSO READ : IND vs PAK: భారత్‍పై మనం గెలవలేం.. కనీసం పోరాడాలి కదా: పాక్ జట్టుపై PCB చీఫ్ ఆగ్రహం