సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ ఎస్సీ సెల్

సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ ఎస్సీ సెల్

సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు రాష్ట్ర  కాంగ్రెస్ ఎస్సీ సెల్ నేతలు. రెండు రోజులుగా కాంగ్రెస్ అక్రమ అరెస్టులకు నిరసనగా క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చింది కాంగ్రెస్ ఎస్సీ సెల్. దీంతో క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల తీరుపై మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో కల్వకుంట్ల ప్రభుత్వం నడుస్తోందన్నారు కాంగ్రెస్ SC సెల్ నేతలు. అయితే వచ్చిన వారిని వచ్చినట్లు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆందోళనకారులను గోషామహాల్ పోలీస్ స్టేషన్ తరలించారు.

కొలువుదీరిన తల్లులు.. కోటొక్క మొక్కులు

దూసుకుపోతున్న టాటా మోటార్స్‌!