నువ్వు రేపిస్ట్ వి..నీకు ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇస్తారు..? మహిళా నేతపై అభ్యర్ధి దాడి (వీడియో)

నువ్వు రేపిస్ట్ వి..నీకు ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇస్తారు..? మహిళా నేతపై అభ్యర్ధి దాడి (వీడియో)

త్వరలో ఓ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక జరగనుంది. ఆ ఎన్నికకు  కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధిని నిలబెట్టింది.  అభ్యర్ధినిి ఎంపిక చేయడం పై అదే పార్టీకి చెందిన ఓ మహిళా నాయకురాలు సదరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్ధిపై మండిపడ్డారు.

అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నువ్వు ఎమ్మెల్యేగా నిలబడడానికి వీల్లేదంటూ హెచ్చరించింది. దీంతో ఎమ్మెల్యే అభ్యర్ధి మహిళా నాయకురాలిపై పార్టీ ఆఫీస్ లో దాడి చేశాడు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. సొంతపార్టీ నేతలే దాడికి దిగడంపై నష్టనివారణ చర్యలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ.

ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది.  ఉత్తర ప్రదేశ్ లో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధి   ముకుంద్ భాస్కర్ మణి త్రిపాఠిని నిలబెడుతూ సీటును ఖరారు చేసింది. ఇదే విషయంపై పార్టీ ఆఫీస్ లో మహిళా నాయకురాలు తారా యాదవ్..  భాస్కర్ అభ్యర్ధిత్వాన్ని ప్రశ్నించింది. రేపిస్టైన భాస్కర్ ను ఎమ్మెల్యేగా ఎలా నిలబెడతారు..? ఇది పార్టీ ఇమేజ్ ను పాడు చేస్తుందంటూ ఏఐసీసీ కార్యదర్శి సచిన్ నాయక్ ముందు తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన భాస్కర్, అతని అనుచరులు తారా యాదవ్ పై దాడి చేశారు. ఈ దాడిలో ఆమె మొహంపై గాయాలయ్యాయి.  ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకత్వాన్ని, ముఖ్యంగా ప్రియాంక గాంధీని కోరారు.

రేపిస్ట్ కు టికెట్ ఇవ్వడం తనకు నచ్చలేదన్నారు. కాంగ్రెస్ ను కించపరచాలనే నాయకులు రేపిస్టైన అభ్యర్ధిని ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు.   నేను నాలుగేళ్లుగా కాంగ్రెస్‌కు సేవలందిస్తున్నాను,ఇంకా కొనసాగుతాను. అత్యాచారం చేసిన నిందితుడు టికెట్ అందుకోవడాన్ని నేను చూడలేను, ”అని ఆమె అన్నారు. సమావేశంలో తనను కొట్టిన పార్టీ కార్యకర్తలపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్లు తారా యాదవ్ తెలిపారు. ఈ విషయంపై కాంగ్రెస్ నాయకులు ఇంకా స్పందించలేదు.

ఇదిలావుండగా, నేషనల్ కమీషన్ ఫర్ ఉమెన్ (ఎన్‌సిడబ్ల్యు) చైర్‌పర్సన్ రేఖ శర్మ ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇలాంటి సిక్ మైండ్ పీపుల్  రాజకీయాల్లోకి ఎలా వస్తారు …?” ట్విట్టర్ లో ప్రశ్నించారు.  తాను  ఏ రాజకీయ నాయకుడి నుండి క్షమాపణ కోరడం లేదు. ఈ అంశంపై తాను  రాజకీయాల్ని చేసేందుకు   ఇష్టపడనంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.