
మెహిదీపట్నం, వెలుగు: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొంది రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కార్వాన్ సెగ్మెంట్ ఏ బ్లాక్ అధ్యక్షుడు కూరాకుల కృష్ణ తెలిపారు. గురువారం మధ్యాహ్నం గాంధీభవన్‌లో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ ఆధ్వర్యంలో కార్వాన్‌లోని వివిధ పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్‌లో చేరారు.
ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. కార్వాన్ సెగ్మెంట్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని.. కేసీఆర్ ఓటమి తప్పదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నగర నాయకులు రఘుపాల్ రెడ్డి, ఆకుల చంద్రశేఖర్, నాయకులు పాల్గొన్నారు.