
గోదావరిఖని, వెలుగు: దేశంలో రాహుల్‌గాంధీ చేపట్టిన జోడోయాత్రతో కాంగ్రెస్కు పూర్వ వైభవం రానుందని, ఆయన నాయకత్వంలో దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఏఐసీసీ పరిశీలకుడు, తమిళనాడు మాజీ ఎంపీ జైకుమార్అన్నారు. గురువారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుల నియామకానికి అభిప్రాయ సేకరణ చేస్తున్నామని, పోటీలో ఉండే అభ్యర్థులు ఈ నెల 19లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
డీసీసీతోపాటు రామగుండం సిటీ అధ్యక్ష పదవి ఎంపిక పూర్తి పారదర్శకంగా జరుగుతుందన్నారు. మీటింగ్‌లో టీపీసీసీ పరిశీలకుడు డాక్టర్ కేతూరి వెంకటేశ్, పార్లమెంట్ పరిశీలకుడు రాజేశ్, లీడర్లు ఎంఏ బాసిద్, గుమ్మడి కుమారస్వామి, బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, లింగస్వామి, రవికుమార్, శ్రీనివాస్, పెద్దెల్లి ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు. కాగా ఐఎన్టీయూసీ పెద్దపల్లి జనరల్ సెక్రటరీ రాచకొండ కోటేశ్వర్లు, మాజీ కార్పొరేటర్ దుబాసి లలిత, గడ్డం మధు, మగ్గిడి దీపక్, అవినాశ్, తదితరులు దరఖాస్తులు సమర్పించారు.
క్యాడర్ అభిప్రాయాల మేరకు పార్టీ పదవులు
హుజూరాబాద్, వెలుగు: డీసీసీ పదవులతోపాటు నియోజకవర్గ, మండల, వార్డు అధ్యక్షులను పార్టీ కార్యకర్తల అభిప్రాయాల మేరకు ఎన్నుకుంటామని ఏఐసీసీ పరిశీలకుడు శ్రీనివాస్ మనె అన్నారు. గురువారం హుజూరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంఘటన్ సృజన్ అభియాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమాన్ని ఐదు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టామని ఇప్పుడు తెలంగాణలో అమలుచేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పీసీసీ పరిశీలకుడు చిట్ల సత్యనారాయణ, మ్యాడం బాలకృష్ణ, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రణవ్ బాబు, కరీంనగర్ పార్లమెంటరీ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్, కార్యకర్తలు పాల్గొన్నారు.