- రాహుల్ యాత్రకు ప్రచారం వచ్చింది కానీ...ఓట్లు రాకపోవచ్చు
- మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా
షిల్లాంగ్: ఈశాన్య రాష్ట్రాల గుండా సాగిన కాంగ్రెస్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ దేశ మీడియాలో సంచలనం సృష్టించినా.. ఆ పార్టీకి ఓట్లు మాత్రం రాకపోవచ్చని మేఘాలయ సీఎం, నేషనల్ పీపుల్స్ పార్టీ చీఫ్ కాన్రాడ్ సంగ్మా అన్నారు. ‘‘ఈ యాత్ర కోసం కాంగ్రెస్ చాలా శక్తిని, వనరులను వెచ్చించింది.. అయితే ఇది ఓట్లు , సీట్లుగా మారకపోవచ్చు. వారు కోరుకునే ఫలితాన్ని పొందుతారని నేను అనుకోవట్లేదు. యాత్రకు మీడియాలో బజ్ క్రియేట్కావడం కంటే ఎన్నికల్లో సీట్లు గెలవడం చాలా పెద్ద సంగతి.
కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా చాలా సమస్యలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా పెద్దపెద్ద నాయకులే కాకుండా.. గ్రౌండ్లెవల్లో కార్యకర్తలు కూడా పార్టీని వీడుతున్నరు. వారు వీటన్నింటిని పరిష్కరించుకొవాలి.. ముందు ఇంటిని చక్కదిద్దుకోవాలి” అని సంగ్మా సూచించారు.
