రైల్వేలో టీసీ ఉద్యోగం ఇప్పిస్తనని మోసం చేసిండు

రైల్వేలో టీసీ ఉద్యోగం ఇప్పిస్తనని మోసం చేసిండు

ఖమ్మం కలెక్టరేట్ ఎదుట యాదగిరి, మౌనిక అనే భార్యాభర్తలు నిరసన వ్యక్తం చేశారు. తన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని తాళ్లూరి రామారావు అనే సివిల్ కానిస్టేబుల్ మోసం చేశాడని యాదగిరి వాపోయారు. రైల్వేలో టీసీ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తమ దగ్గర్నుంచి కానిస్టేబుల్ రామారావు రూ.15 లక్షలు తీసుకున్నాడని ఆరోపించారు. ఆ కానిస్టేబుల్ పై సీపీ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చి సుమారు 3 నెలలవుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమ డబ్బులు తమకు ఇప్పించగరని కలెక్టర్ ను కోరుతున్నట్లు ఆ దంపతులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆ ఇద్దరూ కలిసి కలెక్టరేట్ ఎదుట తమకు జరిగిన మోసాన్ని తెలియజేస్తూ.. బ్యానర్ లో వివరాలు తెలియజేస్తూ నిరసన వ్యక్తం చేశారు.