ఆర్మూర్ ​అభివృద్ధికి నిధులు ఇవ్వండి

ఆర్మూర్ ​అభివృద్ధికి నిధులు ఇవ్వండి
  •     సీఎంను కోరిన వినయ్ రెడ్డి

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ  ఇన్ చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి  కోరారు. శనివారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.

సీఎంతో ఆర్మూర్ నియోజకవర్గ సమస్యలపై చర్చించి ఫండ్స్​ మంజూరు చేయాలని కోరారు. ఆయన సానుకూలంగా స్పందించారని, త్వరలోనే నిధులు మంజూరు అవుతాయని వినయ్​ రెడ్డి తెలిపారు.