రాజ్యాంగ రక్షణ యాత్ర ప్రారంభం

రాజ్యాంగ రక్షణ యాత్ర ప్రారంభం

మహబూబ్ నగర్ టౌన్ , వెలుగు: తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్యాంగ రక్షణ యాత్రను  మంగళవారం జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్  సమీపంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్​ నుంచి ప్రారంభించారు. ఈ సందర్బంగా టీఎంఎం రాష్ట్ర సమన్వయకర్త మాట్లాడుతూ రాజ్యాంగ రక్షణ కోసం ఉమ్మడి జిల్లాల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా ఈ యాత్రను నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, జాతీయ ప్రధాన కార్యదర్శి బైరి రమేశ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవికాంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బుట్టి సత్యనారాయణ, వెన్న రాజు, జై భీమ్ సైనిక్  దళ్  రాష్ట్ర కన్వీనర్ పురుషోత్తం, జిల్లా అధ్యక్షుడు గండీటి చిన్న, ఆంజనేయులు, గుడ్ల రవికుమార్  తదితరులు  పాల్గొన్నారు.