మెదక్ లో మాడ్రన్​ గోడౌన్స్ 

మెదక్ లో మాడ్రన్​ గోడౌన్స్ 
  •     లేటెస్ట్​ టెక్నాలజీతో నిర్మాణం
  •     19,628 మెట్రిక్​ టన్నుల సామర్థ్యం

మెదక్, వెలుగు : సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో మాడ్రన్​గోడౌన్స్​ నిర్మించారు. మెదక్, - సిద్దిపేట నేషనల్​ హైవే 765 డీజీ పక్కన దశాబ్దాల క్రితం నిర్మించిన సీడబ్ల్యూసీ గోడౌన్స్​ ఉన్నాయి. సిమెంట్​తో నిర్మించిన ఆ గోడౌన్​ సామర్థ్యం 11,566 మెట్రిక్​ టన్నులు ఉండగా వాటిలో పీడీఎస్​ బియ్యంతో పాటు, రైస్​ మిల్లర్లు బాయిల్డ్​ రైస్​, వ్యాపారులు శెనగలు, గోధుమలు, పత్తి  స్టోర్​ చేస్తారు. కాగా సీడబ్ల్యూసీ హైదరాబాద్​ రీజియన్​ పరిధిలో తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా 2022లో మెదక్​లో ప్రీ ఇంజినీరింగ్​ గోడౌన్స్​ మంజూరయ్యాయి. పాత గోడౌన్స్​ పక్కనే సువిశాల స్థలంలో రూ.20 కోట్ల వ్యయంతో 19,628 మెట్రిక్ టన్నుల కెపాసిటీతో రెండు భారీ గోడౌన్​లను నిర్మించారు.

ఒక గోడౌన్​లో 51,820 ఎస్​ఎఫ్​టీ, మరో గోడౌన్​ 60,487 ఎస్​ఎఫ్​టీ కలిపి మొత్తం 1,12,307 ఎస్​ఎఫ్​టీ స్పేస్​అందుబాటులో ఉంది.  మల్టీ నేషనల్ కంపెనీలు, మాల్స్, సూపర్ మార్కెట్లు, ఎలక్ట్రానిక్ గూడ్స్, ఫర్నిచర్​, గన్నీ వ్యాపారులు తమ స్టాక్​ స్టోర్ చేసుకునేందుకు ఈ గోడౌన్స్ అద్దెకు ఇస్తారు. ఒక్కొక్కరికి మినిమం 5 వేల ఎస్​ఎఫ్​టీ స్పేస్​అద్దెకిస్తారు. ఒక ఎస్ఎఫ్​టీకి 16 రూపాయల 45 పైసల చొప్పున అద్దె చెల్లించాల్సి ఉంటుంది.

గోడౌన్​అద్దెకు తీసుకున్న వారు 24 గంటలు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు గోడౌన్​ తెరుచుకొని స్టోర్​ చేసిన వస్తువులు, సరుకులు తీసుకోవడం, కొత్తగా వచ్చిన వాటిని స్టోర్​చేసుకునే వీలుంటుంది. ఈ గోడౌన్​లు చాలా హైట్​ఉండడంతో పాటు, లేటెస్ట్​టెక్నాలజీతో నిర్మించడం వల్ల లోపల కూల్​గా ఉండి స్టోర్​ చేసిన సరుకులు, వస్తువులు పాడుకాకుండా ఉంటాయి. అంతేగాక గోడౌన్ ల దగ్గర సీసీ కెమెరాల నిఘా, హైమాస్ట్​ లైట్లు, సెక్యూరిటీ సౌకర్యాలు ఉంటాయి. 

త్వరలో అందుబాటులోకి 

తెలంగాణలో మొదటి సారి మెదక్​లో నిర్మించిన ప్రీ ఇంజినీరింగ్​ గోడౌన్​ల నిర్మాణం దాదాపు పూర్తయింది. త్వరలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. మోర్, రిలయన్స్, విశాల్​ మార్ట్, ఫర్నిచర్​ షాప్స్​ వాళ్లు ఈ గోడౌన్​లలో స్పేస్​అద్దెకు తీసుకోవచ్చు. వారు స్టోర్​ చేసుకునే స్టాక్​కు పూర్తి సెక్యూరిటీ ఉంటుంది. వ్యాపారులు ఈ గోడౌన్​ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

కోటేశ్వర్​రావు, వేర్​హౌజ్​ మేనేజర్