
దుబ్బాక, వెలుగు: దుబ్బాక పట్టణంలో ట్రాఫిక్ రోజు రోజుకు పెరిగిపోతుందని రింగ్ రోడ్డు నిర్మాణంతోనే దీనికి పరిష్కారం దొరుకుతుందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. రింగ్ రోడ్డు గురించి ఆర్‌అండ్‌బీ అధికారులతో ఆయన మంగళవారం హైదరాబాద్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెగ్మెంట్‌లో అవసరమైన నూతన రోడ్ల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
మండల పరిధిలోని హబ్షీపూర్ నుంచి దుబ్బాక వరకు నాలుగు లేన్ల రోడ్డుకు, మిరుదొడ్డి మండలం అందె గ్రామం నుంచి దుబ్బాక మండలం తిమ్మాపూర్వరకు డబుల్ రోడ్నిర్మాణ ప్రతి పాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న రోడ్ల స్థితి గతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమీక్ష సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఈఈ బాల ప్రసాద్, డీఈ వెంకటేశం, ఏఈఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.