ఈ స్కూటర్ బరువులు మోయడమే కాదు బస్తాలూ ఎత్తగలదు.. వీడియో

ఈ స్కూటర్ బరువులు మోయడమే కాదు బస్తాలూ ఎత్తగలదు.. వీడియో

అవసరం అనేది ఎన్నో ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతుంది. జీవితాన్ని సులభతరం చేయడానికి సాంకేతికతతో కూడిన ఆవిష్కరణలు ఎంతో ఉపయోగపడతాయనడానికి ఈ వాఖ్యం ఉదాహరణగా నిలుస్తోంది. నిర్మాణ కార్మికులు తమ పనిని సులభంగా, చౌకగా చేసుకునేందుకు ఓ కొత్త పద్ధతిని కనుగొన్నారు. అందులో భాగంగా పాత బజాజ్ స్కూటర్ ను ఎలక్ట్రిక్ మెషిన్ గా ఉపయోగిస్తూ వార్తల్లో నిలిచారు. దీనికి సంబంధించిన వీడియోను పంకజ్ పరేఖ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో పాటు ఈ ఈ స్కూటర్‌ని రోడ్లపై డ్రైవింగ్ చేసేందుకే కాకుండా ఎలా ఉపయోగించవచ్చో బజాజ్ కూడా ఊహించలేదు అనే క్యాప్షన్ ను జత చేశాడు.

ఈ వీడియోలో ఓ వ్యక్తి చక్రాలు లేని పాత బజాజ్ స్కూటర్ పై కూర్చొని ఎక్సిలరేటర్ ను రైజ్ చేయగా, ఆ బండి హ్యాండిల్ కు తాడుతో కట్టి ఉన్న తెల్లని బరువైన బ్యాగ్.. ఎత్తుకు చేరుతుంది. భవనం యొక్క మూడవ ఫ్లోర్ కి బరువైన బ్యాగ్‌ను ఎత్తడానికి కార్మికులు లోహపు కడ్డీలతో తిరిగే చక్రానికి తాడు కట్టి అలా తమ పనిని సులభతరం చేసుకున్నారో ఈ వీడియో తెలియజేస్తుంది. అయితే ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం నుంచి వచ్చిందని కొందరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయులకు పుట్టుకతోనే ఇంజినీరింగ్ ఆలోచన ఉంటుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరేమే ఇది పాత ఆలోచన అని, కానీ చాలా కాలం తర్వాత మళ్లీ ఇలా కనిపించడం చాలా బాగుందని రిప్లై ఇస్తు్న్నారు.