మండు వేసవిలో చల్లని 'రాగుల'ను తీసుకోండి

మండు వేసవిలో చల్లని 'రాగుల'ను తీసుకోండి

భారతీయులు 'రాగి'ని తృణధాన్యాల్లోనే గొప్పదిగా విశ్వసిస్తుంటారు. ముఖ్యంగా ఇవి ఈ వేసవిలో శరీరానికి చల్లదనాన్నిస్తుంది. రాగి యాంటీ ఆక్సిడెంట్ తో పాటు పోషకాహారిగానూ సహాయపడుతుంది. రాగి పోషక విలువలను హైలైట్ చేస్తూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఇటీవల ఒక ట్వీట్‌ను కూడా పోస్ట్ చేసింది. ఇది చక్కెర స్థాయిలను నియంత్రించడం, ఎముకలకు బలాన్ని చేకూర్చడం, చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని పునరుద్ధరించడం, దెబ్బతిన్న కండరాల కణజాలాలను నయం చేయడం, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉండడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉందని FSSAI పోస్ట్ లో వెల్లడించింది. 

మన రోజువారీ ఆహారంలో రాగులను చేర్చుకోవడం అంత కష్టమేం కాదు. వీటిని రోటీలు, దోసెలు, బిస్కెట్లు.. ఇలా చాలా రకాలుగా వీటిని తీసుకోవచ్చు. ఇవన్నీ రాగుల పిండితో తయారు చేయవచ్చు. వీటితో రాగి-ఖర్జూరం లడ్డూ, రాగి-కోకో కేక్‌లు, డెజర్ట్‌లు లాంటి ఆరోగ్యకరమైన రెసిపీలను కూడా తయారు చేసుకోవచ్చు. ఒక గ్లాసు పాలలో ఉండే కాల్షియం విలువలు రాగి రోటీల్లో లభిస్తాయని ది హెల్త్ ప్యాంట్రీ వ్యవస్థాపకులు, పోషకాహార నిపుణులు ఖుష్బూ జైన్ తిబ్రేవాలా తెలిపారు. ఇది యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్నందున శరీరంలోని అవయవాల వాపును తగ్గించడంలో, గ్లూకోజ్  స్థాయిలను రుగుపరచడంలో సహాయపడుతుందన్నారు.

వేసవిలో ప్రజలంతా "రాగి కూజ్" అని పిలిచే పానీయాన్ని ఆస్వాదించాలని  తిబ్రేవాలా చెప్పారు. కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి ప్రాంతాలలో పులియబెట్టిన రాగి నుండి శీతలీకరణ పానీయం తయారు చేయారవుతుంది. దీన్నే 'కూజ్' అని పిలుస్తారు. ఇది కడుపుని చల్లబరచడమే కాకుండా, తక్షణ శక్తిని అందిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, రాగి  కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అల్పాహారంగా రాగి రేకులు, రాగి పిండితో చేసిన చపాతీలు తినడం వల్ల అధిక ఫైబర్ కంటెంట్ ఉన్నందున బరువును నియంత్రిస్తుంది. అలాగే రాగుల పిండిని పాలతో కలిపి ముఖానికి రాసుకుంటే ముడతలు పోతాయి. ఇందులో కొల్లాజెన్, యాంటీఆక్సిడెంట్లు ఉన్నందున ఇవి వృద్ధాప్య సంకేతాలను నిరోధిస్తాయి.