తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్నం : బహుజన భారత్​ పార్టీ జాతీయ అధ్యక్షుడు

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్నం : బహుజన భారత్​ పార్టీ జాతీయ అధ్యక్షుడు
  • తొలి దశలో 15 మంది అభ్యర్థుల జాబితా విడుదల

ఖైరతాబాద్​,వెలుగు:  రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన భారత్ పార్టీ పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్  వెంకటేశ్​ కసబే తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియా  సమావేశంలో  ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్​అధికారంలోకి వస్తే తెలంగాణకు దళిత సీఎంను చేస్తానని చెప్పి కేసీఆర్​మాట తప్పారని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్​, బీజేపీ ఓట్లకోసం హామీలు ఇవ్వడమే తప్ప అమలు సాధ్యం కాదన్నారు.

తమ పార్టీ తరపున తొలిదశలో 15 మంది అభ్యర్థులను ఎంపిక చేశామని,అనంతరం వారి జాబితాను ప్రకటించారు.  పార్టీ తెలంగాణ ఇన్​చార్జి బాబూరావు గైక్వాడ్​గజ్వేల్​,జుక్కల్​లో  పోటీచేస్తున్నట్లు ప్రకటించారు.  రెండోదశ అభ్యర్థుల జాబితా త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఇప్పటికే  కర్నాటక, మహారాష్ట్రలో పోటీ చేశామని, తెలంగాణలో అన్నిస్థానాల్లో తమ అభ్యర్థులు  పోటీలో ఉంటారని చెప్పారు. ఈ సమావేశంలో పలువురు బహుజన భారత్​ పార్టీ నేతలు పాల్గొన్నారు.