సంభాల్ మసీదులో సర్వే కొనసాగించండి: అలహాబాద్ హైకోర్టు ఆదేశం

సంభాల్ మసీదులో సర్వే కొనసాగించండి: అలహాబాద్ హైకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‎లోని సంభాల్‎లో షామీ జామా మసీదు, హరిహర ఆలయ వివాదంలో సంభాల్ సివిల్ కోర్టు ఇచ్చిన సర్వే ఆదేశాలను సవాలు చేస్తూ మసీదు మేనేజ్ మెంట్ కమిటీ వేసిన పిటిషన్ ను అలహాబాద్  హైకోర్టు సోమవారం కొట్టివేసింది. మసీదులో సర్వే కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఈమేరకు సింగిల్ జడ్జి బెంచ్ జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

 ఈ కేసులో కమిషనర్ ను నియమించాలని గతంలో సంభాల్  కోర్టు ఇచ్చిన ఆదేశాలను జడ్జి సమర్థించారు. అలాగే, ఈ కేసు విచారణ అర్హతను కలిగి ఉందని పేర్కొన్నారు. కాగా, సంభాల్  కేసులో అలహాబాద్ హైకోర్టు వెలువరించిన ఉత్తర్వులపై హిందూ సంఘాల తరపు అడ్వొకేట్  గోపాల్  శర్మ హర్షం వ్యక్తం చేశారు