ఐటీసీ ఫ్యాక్టరీలో ప్రమాదం..రేకులు మార్చుతుండగా కాంట్రాక్ట్​ కార్మికుడు మృతి

ఐటీసీ ఫ్యాక్టరీలో ప్రమాదం..రేకులు మార్చుతుండగా కాంట్రాక్ట్​ కార్మికుడు మృతి

బూర్గంపహాడ్, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్​ మండలంలోని సారపాక ఐటీసీ కర్మాగారంలో ప్రమాదవశాత్తు కాంట్రాక్టు కార్మికుడు చనిపోయాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. దుమ్ముగూడెం మండలం పెద్ద కమలాపురానికి చెందిన హరీశ్(25) సారపాక గాంధీనగర్​లో ఉంటూ ఐటీసీలో కాంట్రాక్ట్​ కార్మికుడిగా పని చేస్తున్నాడు. గురువారం పీఎం-7 విభాగంలోని రూప్  షీట్​ రేకులు వర్షానికి కారుతుండగా, వాటిని లైఫ్  లైన్  తాడు సాయంతో రిపేర్లు చేస్తున్నాదు. ఈ క్రమంలో నడుముకు ఉన్న బెల్ట్​ ఊడిపోవడంతో ప్రమాదవశాత్తు కిందపడ్డాడు.

తీవ్రంగా గాయపడిన హరీశ్​ను తోటి కార్మికులు అంబులెన్స్ లో భద్రాచలం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడు పద్మ ఇన్సూలేషన్  కంపెనీ కాంట్రాక్టర్  వద్ద కాంట్రాక్ట్​ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఫ్యాక్టరీలో కార్మికుల భద్రతను పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు.