శాంతి భద్రతలు కాపాడటానికి సహకరించండి.. : అమిత్ షా

శాంతి భద్రతలు కాపాడటానికి  సహకరించండి.. : అమిత్ షా

ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్ లో జరుగుతున్న హింసాత్మక ఘటనల పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆవేదన వ్యక్తం చేశారు. కర్ఫ్యూ అమలులో ఉండటం వల్ల మణిపుర్లో పరిస్థితి అదుపులో ఉందని షా చెప్పారు. శాంతి భద్రతలు కాపాడటానికి సహకరించాలని ప్రజలకు  విజ్ఞప్తి చేశారు.

అందరినీ సంప్రదిస్తాం...

మెయిటీ కమ్యూనిటీకి షెడ్యుల్డ్ తెగ హోదా విషయంలో నిర్ణయం తీసుకునేముందు మణిపుర్ లో అందరినీ సంప్రదిస్తామని పేర్కొన్నారు.  ఈ హింసాకాండపై ఇరుపక్షాల వాదనలు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.  ఇప్పటికే అక్కడ జరిగిన కాల్పుల్లో 54 మంది మృతి చెందగా, వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. 23,000 మందికి పైగా నిర్వాసితులు సైనిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.

ఘర్షణకు కారణం ఇదే...

మణిపుర్ లో మే 3న కుకీ గిరిజన సమూహం నిర్వహించిన నిరసన కవాతులో, గిరిజనేతర మైతేయి కమ్యూనిటీతో ఘర్షణలకు దారి తీసిన తరువాత అశాంతి చెలరేగింది. హిందు మైతీ  కమ్యూనిటీని షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీలు)  జాబితాలో చేర్చాలనే డిమాండ్ మొదలైంది. రెండు రోజుల పాటు చురచంద్ పూర్, ఇంఫాల్ ఈస్ట్ , వెస్ట్ , బిష్ణుపూర్ తదితర జిల్లాల్లో కార్లు, భవనాలు తగలబెట్టారు. హోటల్ లు ధ్వంసం చేశారు. ఘర్షణలను అదుపు చేసేందుకు పోలీసులు, పారామిలిటరీ సిబ్బందిని రంగంలోకి దిగారు. ఇంటర్నెట్ సేవల్ని సైతం నిలిపివేశారు. కర్ఫ్వూ విధించారు.