తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కు వాచ్ మెన్ విరాళం

V6 Velugu Posted on May 15, 2021

కరోనాను అరికట్టడానికి ప్రతీ ఒక్కరు తమ వంతుగా కృషి చేస్తున్నారు. కరోనా బారిన పడ్డవారికి కొందరు మందులు, ఆహార పదార్ధాలు అందిస్తుంటే..మరికొందరు డబ్బుల రూపంలో సాయం అందిస్తున్నారు. ఇందులో భాగంగానే తమిళనాడులో సీఎం రిలీఫ్ ఫండ్ కు ఓ వాచ్ మెన్ తన నెల జీతాన్ని విరాళంగా ఇచ్చారు.

కరోనా పోరులో భాగంగా సహాయ నిధికి విరాళం అందించాలన్న తమిళనాడు  సీఎం ఎంకె స్టాలిన్‌ పిలుపుతో సినీ ఇండస్ట్రీలోని పలువురు స్పందించి..విరాళాలు అందించారు. వీరితో పాటు.. నైట్ వాచ్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న తంగదొరై.. తన నెలవారీ జీతం రూ. 10,101 సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించారు. తాను చేసి సాయం కొంత మందికైనా సాయపడుతుందని తెలిపారు. తంగదొరై చేసిన విరాళం గురించి తెలుసుకున్న సీఎం... ఆయన్ను తన కార్యాలయానికి పిలిపించుకుని మాజీ సీఎం, తన తండ్రి కరుణానిధి రాసిన పుస్తకం తిరుక్కురల్‌ కాపీని బహుమతిగా ఇచ్చారు. సీఎం స్టాలిన్ ను కలిసే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు తంగదొరై. పుస్తకం ఇవ్వడం మరింత సంతోషంగా ఉందన్నారు.

Tagged corona, Watchman contribution, Tamil Nadu CM relief fund, 1-month salary

Latest Videos

Subscribe Now

More News