కోఠిలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల ఆందోళన

కోఠిలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల ఆందోళన

కోఠిలోని డీఎంకే ఆఫీస్ ముందు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 86 మంది నర్సులకు స్వంత జిల్లాలోనే విధులు కేటాయించడంతో పాటు పెండింగ్ లోఉన్న ఇన్ సెంటివ్స్ చెల్లించాలంటూ ఆరోగ్య శాఖ కమిషనర్ చాంబర్ ముందు బైటాయించారు. దూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇవ్వడం వల్ల కుటుంబాలకు దూరంగా ఉంటూ మానసిక ఒత్తిడికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే స్టేట్ ప్రాజెక్టు ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న సత్య అనే అధికారి సమయపాలన లేకుండా మెసేజ్ లు పెడుతూ వేధిస్తున్నాడని..అతన్ని విధుల నుంచి తప్పించాలని వారు డిమాండ్ చేశారు.