
మెగా డాటర్ నిహారిక కొణిదెల(Niharika) తన భర్త చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకున్న విషయం తెలిసేందే. ఈ విడాకుల నేపథ్యంపై సోషల్ మీడియాలో బాగా డిస్కషన్స్ జరిగాయి. ఇక లేటెస్ట్ గా నిహారిక.. సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ పై నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. రీసెంట్ గా ది సోల్ అఫ్ సత్య(The Soul Of Satya).. అంటూ స్పెషల్ సాంగ్ లో హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej), హీరోయిన్ కలర్స్ స్వాతి(Colors Swathi) యాక్ట్ చేసిన విషయం తెలిసేందే. ఈ స్పెషల్ సాంగ్ లో సాయి ధరమ్ తేజ్ దేశం కోసం పోరాడే సైనికుడిగా, అతని వైఫ్ సత్యగా స్వాతి..భర్త కోసం పడే ఆవేదన,ఆమె సంతోషం,ఆమె ఆనందం హార్ట్ టచ్ గా ఉండటంతో సాంగ్ చాలా ఫేమస్ అయింది.
ది సోల్ ఆఫ్ సత్య సాంగ్ ప్రమోషన్ కి ముందు నిహారిక ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. ఈ పాట కోసం నేను ఎంతగానో వెయిట్ చేస్తున్నాను' అని పోస్ట్ చేసింది. నిహారిక పోస్ట్ కు ఓ నెటిజన్ రియాక్ట్ అవుతూ.. 'వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్..పెళ్లి చేసుకున్నాక ఫ్యామిలీ మీద లేకపోయే' అంటూ కామెంట్ చేసాడు. నెటిజన్ కామెంట్స్కు స్పందించిన హీరో సాయి తేజ్ గట్టి వార్నింగ్ ఇస్తూ.. 'నోరు అదుపులో పెట్టుకో...వెంటనే కామెంట్ డిలీట్ చేయ్' అని రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ ఇంస్టాచాట్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.
అలాగే ఈ కామెంట్స్ని ఇన్ స్టా నుంచి ఎవరికి వారు డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రసెంట్ ఇంస్టాలో ఎలాంటి కామెంట్స్ కనిపించక పోయేసరికి..హీరో సాయి ధరమ్ తేజ్ వార్నింగ్ కి నెటిజన్ భయపడి.. ఆ కామెంట్స్ ను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇటువంటి కామెంట్స్ ఎలాగైనా సోషల్ మీడియాలో అనవసరమైన చర్చకు దారి తీస్తుందని సాయితేజ్ సైతం భావించి డిలీట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక వీరిద్దరి పై ఇప్పట్లో ట్రోల్ల్స్ ఆగేలా లేవని..మరికొందరు రియాక్ట్ అవుతున్నారు.