
న్యూఢిల్లీ: రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఏజీ పెరారివాలన్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో పెరారివాలన్‌కు పడిన మరణశిక్షను 2014లో యావజ్జీవ శిక్షగా మార్చారు. 30 ఏండ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నానని, బెయిల్ మంజూరు చేయాలని పెట్టుకున్న పిటిషన్‌ను జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, బీఆర్.గవాయ్‌ల బెంచ్ బుధవారం మరోసారి విచారించింది. ఇన్నేండ్లలో అతని ప్రవర్తనపై ఎటువంటి ఫిర్యాదులు లేకపోవడంతో షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నట్టు వెల్లడించింది. బయటికెళ్లాక ప్రతినెలా లోకల్ పోలీస్‌స్టేషన్‌లో రిపోర్టు చేయాలని పేర్కొంది. పోలీసుల అనుమతి లేకుండా సొంత ఊరు జోలార్‌పెటాయ్ విడిచి వెళ్లకూడదని పెరారివాలన్‌ను కోర్టు ఆదేశించింది.