కొత్తిమీర మీ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుతుంది

కొత్తిమీర మీ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుతుంది

మనం రోజూ తీసుకునే భోజనంలో కొత్తిమీర ఆకులను ఉపయోగించడం అందరికీ తెలిసిన ప్రక్రియే. అయితే ఇది ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి 100 గ్రాముల కొత్తిమీరలో 31 కేలరీలు ఉంటాయి. ఇది 4 గ్రాముల ప్రోటీన్, 0.7 గ్రాముల కొవ్వు, 146 mg కాల్షియం, విటమిన్లు A,C లు ఉంటాయి. అంతే కాకుండా జీవక్రియకు సహాయపడే ఎంజైమ్‌లు కూడా కొత్తిమీరలో ఉంటాయి. ఇవే కాకుండా కొత్తిమీర అనేక ఇతర ప్రయోజనాలను కలిగి ఉంటుంది.

కొత్తిమీర వల్ల కలిగే ప్రయోజనాలు:

1. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి

కొత్తిమీరలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది మన కణాలు, కణజాలాలకు కూడా ఉపశమనం ఇస్తుంది. ఇది శరీరంలో నొప్పులను తగ్గిస్తుంది. అంతే కాదు శరీరంలోని అనేక భాగాల వాపులను కూడా తగ్గిస్తుంది.

2. మంచి కొలెస్ట్రాల్‌ను ప్రోత్సహిస్తుంది

కొత్తిమీర మంచి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, ధమనులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. గుండె సమస్యలతో బాధపడే వారికి ఇది మేలు చేస్తుంది. అంతే కాకుండా చెడు కొలెస్ట్రాల్‌తో పోరాడుతున్న వారికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

3. కడుపు ఉబ్బరాన్ని నివారిస్తుంది

ఉబ్బరం విషయంలో కొత్తిమీర వినియోగం అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రించడంలో సహాయపడే కొన్ని ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది. దాంతో పాటు ఇందులో ఉండే ఎంజైమ్‌లు ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడతాయి. ఈ కారణంగా ఉబ్బరం సమస్య ఉండదు.

4. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి

కొత్తిమీరలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆందోళనను తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జ్ఞాపకశక్తిని పెంచడంలోనూ ఇది తోడ్పడుతుంది. కాబట్టి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న కొత్తిమీరను ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం.