మహారాష్ట్రలో విజృంభించిన కరోనా

మహారాష్ట్రలో విజృంభించిన కరోనా
  • గడచిన 24 గంటల్లో 11,877 కొత్త కేసులు
  • 50 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదు 

ముంబయి: మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో ఏకంగా 11 వేల 877 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో 9 మంది మరణించారు. నిన్నటితో పోల్చితే ఇవాళ కేసుల పెరుగుదల 29 శాతం ఎక్కువగా ఉంది. అలాగే మరో 50 కొత్త ఒమిక్రాన్ కేసులు కూడా నమోదయ్యాయి. కొత్త కేసుల్లో ఎక్కువగా పుణే ప్రాంతంలోనే నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. మహారాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా 42,024 యాక్టివ్ కేసులు ఉన్నాయని, ముంబయి నగరంలో 8,063 కేసులు నమోదయినట్లు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) వెల్లడించింది. నిన్నటితో పోల్చితే ఈ కేసుల శాతం 27 శాతం ఎక్కువగా నమోదైంది. అయితే గడచిన 24 గంటల్లో ముంబయి  పరిధిలో ఎలాంటి మరణాలు నమోదు కావడం ఊరట కలిగిస్తోందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ముంబయి నగరంలో 29,819 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు.