కనికా కపూర్‌పై ‘కరోనా’ కేసు నమోదు

కనికా కపూర్‌పై ‘కరోనా’ కేసు నమోదు

బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌పై కేసు నమోదయింది. ఈ నెల 15న లండన్ నుంచి వచ్చిన ఆమె హోం క్వారంటైన్‌లో ఉండకుండా పలు పార్టీలలో పాల్గొన్నారు. కనికా ఒక ఫైవ్ స్టార్ హోటళ్లో విందు ఏర్పాటు చేసింది. ఆ విందుకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. హోం క్వారంటైన్‌లో ఉండకుండా పార్టీలలో పాల్గొని, వైరస్ వ్యాప్తికి కారణమవుతుందనే కారణంతో ఆమెపై సరోజిని నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు కమిషనర్ సుర్జిత్ పాండే తెలిపారు. కనికా తన విదేశీ ప్రయాణాన్ని ప్రభుత్వానికి చెప్పకపోవడంపై యూపీ ప్రభుత్వం ఆమెపై సీరియస్‌గా ఉంది.

కనికాకు కరోనా పాజిటివ్ రావడంతో.. ఆ పార్టీకి హాజరైనవారందరూ ఇప్పుడు కరోనా భయంతో వణుకుతున్నారు. అందరూ హోం క్వారంటైన్‌ వైపు మొగ్గు చూపుతున్నారు.

లక్నో చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు కనికాపై ఐపీసీ సెక్షన్లు 269, 270, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. కనికా ఏయే పార్టీలకో వెళ్లిందో ఆ పార్టీలకు వచ్చిన వారందరి వివరాలు తెలుసుకోవడానికి యూపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.

హజరత్ గంజ్ మరియు గోమతి‌నగర్ ప్రాంతాలలో కూడా కనికా సమావేశాలు నిర్వహించింది. దాంతో ఆమెపై ఆ ప్రాంత పోలీస్ స్టేషన్‌లలో కూడా మరో రెండు ఎఫ్ఐఆర్‌లు దాఖలయ్యే అవకాశం ఉంది.

For More News..

కరోనాపై విరుష్క జంట వీడియో సందేశం

కరోనాతో దేశాలు ఆగమాగం