దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో నమోదయిన కేసుల సంఖ్య 174కి చేరినట్లు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కేసులలో 143 మంది భారతీయులు ఉండగా.. మరో 31 మంది విదేశీయులు ఉన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 3కు చేరింది. ఎక్కువ కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. మహారాష్ట్ర 47 కేసులతో దేశంలోనే ప్రథమస్థానంలో ఉంది. ఆ తర్వాత 27 కేసులతో కేరళ రెండో స్థానంలో ఉంది. ఇక తెలుగురాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ వ్యాప్తంగా 13 కేసులు నమోదుకాగా.. ఆంధ్రలో రెండు కేసులు నమోదయ్యాయి.

ప్రపంచ వ్యాప్తంగా 2,19,387 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో 8,970 మంది చనిపోగా.. 85,749 మంది రికవరీ అయ్యారు.

For More News..

ఇటలీలో కరోనా రికార్డు.. నిన్న ఒక్కరోజే..

పారాసిటమాల్‌తో ఇన్‌ఫెక్షన్ తగ్గదు.. సీసీఎంబీ డైరెక్టర్

24 గంటలు.. ఆన్ డ్యూటీ.. రంగంలోకి హెల్త్ సోల్జర్స్

ఒక్కరోజే 8 పాజిటివ్ కేసులు.. మొత్తంగా 13కు చేరిక

కరోనా ఎఫెక్ట్: కరీంనగర్​లో మూడు కిలోమీటర్లు షట్​ డౌన్