ఆస్పత్రిలో కరోనా పేషెంట్ హల్ చల్ : నేను టైగర్ బిడ్డను..నాకు తందూరి చికెన్ కావాలి

ఆస్పత్రిలో కరోనా పేషెంట్ హల్ చల్ : నేను టైగర్ బిడ్డను..నాకు తందూరి చికెన్ కావాలి

నాకు పప్పన్నం వద్దు. తందూరి చికెన్, ఫిష్, మటన్ పెడితేనే అన్నం తింటానంటూ ఓ కరోనా పేషెంట్ తెగేసి చెప్పాడు. అంతేకాదు ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన అన్నాన్ని నేను తినను అంటూ పక్కన బెట్టాడు. ప్రస్తుతం ఆ బాధితుడు తీసిన మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మధ్యప్రదేశ్  భోపాల్ కు చెందిన సయీద్ భోపాలి అనే వ్యక్తి కరోనా వైరస్ లక్షణాలు ఉండడంతో ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. టెస్ట్ ల్లో పాజిటీవ్ వచ్చింది. ప్రస్తుతం సయీద్ ఆస్పత్రిలోనే ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. కరోనా పేషెంట్లకు ప్రభుత్వం అన్నం సరఫరా చేస్తుంది.ఈ నేపథ్యంలో సయీద్ నేను ఈ పప్పన్నం తినను అంటూ వీడియో తీశాడు.

ఎప్పుడు చూసినా ఫిర్యాదులే

15 రోజుల క్రితం ఆస్పత్రిలో జాయిన్  సయీద్ ఆహారం విషయం లో ప్రతీరోజు ఫిర్యాదు చేస్తున్నాడని డాక్టర్ డాక్టర్ అజయ్ గోయెంకా అన్నారు. మిగిలిన బాధితుల్ని ఎలా ట్రీట్ మెంట్, ఆహారం అందిస్తున్నామో తనకి అలాగే ఇస్తున్నామని అన్నారు.

వీడియోలో ఏముందంటే

ఒక ప్లేట్ ఫుడ్ చూపిస్తూ నా పేరు సయీద్ భోపాలి. పప్పన్నం తినడం వల్ల నా చిగుళ్లు నొప్పిగా ఉన్నాయి. నేను సింహపు బిడ్డను …. వినండి, నేను ఈ ఆహారాన్ని తినను. అనారోగ్యంతో ఉన్నప్పుడు తిన్నా. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. నాకు చికెన్, చికెన్ తందూరి, ఫిష్  కావాలి. నేను ఈ ఆహారాన్ని తినను. ఇంటి నుంచి ఫుడ్ తీసుకొని రండి అంటూ వీడియోలో చెప్పాడు. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.