తగ్గుతున్న కేసులు..పెరుగుతున్న మరణాలు

తగ్గుతున్న కేసులు..పెరుగుతున్న మరణాలు

దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2 లక్షల 22 వేల 315 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2 కోట్ల 67 లక్షల 52 వేల 447కు పెరిగింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 4 వేల 454 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 3 లక్షల 2 వేల మంది డిశ్చార్జ్ కాగా..ఇప్పటివరకూ 2 కోట్ల 37 లక్షల 28 వేల 11 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 27 లక్షల 20 వేల 716 యాక్టివ్ కేసులున్నాయి. 

దేశంలో కరోనా మరణాలు 3 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా కారణంగా 4 వేల 454 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య  3 లక్షల 3 వేలు దాటింది. కరోనా కారణంగా అత్యధిక మరణాలు నమోదైన దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. అమెరికా, బ్రెజిల్ వరుసగా భారత్ కంటే ముందు స్థానాల్లో ఉన్నాయి. అమెరికాలో ఇప్పటివరకూ 6 లక్షల 4 వేల మంది కరోనాకు బలికాగా...బ్రెజిల్ లో 4 లక్షల 49 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ తర్వాత మెక్సికోలో అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయారు. మెక్సికో లో కరోనా కారణంగా 2 లక్షల 21 వేల మంది చనిపోయారు.