మెంటల్​ హెల్త్​ పైనా కరోనా దెబ్బ

మెంటల్​ హెల్త్​ పైనా కరోనా దెబ్బ
  • వైరస్​ భయంతో ఆర్థిక అస్థిరత పెరుగుతుందనే టెన్షన్​
  • జాబ్​ లాస్​, శాలరీ కట్స్​పై చాలా మందిలో ఆందోళన
  • నార్మల్​ లైఫ్​లో భారీ మార్పులు తప్పవన్న సైకాలజిస్టులు
  • కరోనా వార్తలకు దూరంగా ఉండాలని సూచన

ముంబై: కరోనా ఎఫెక్ట్​ ముగిసినా మళ్లీ తమ జీవితాలు నార్మల్​కు ఎప్పుడు వస్తాయో అని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. కొందరైతే తమ ఫైనాన్షియల్​ సిట్యువేషన్​ ఎలా ఉంటుందో అని టెన్షన్​ పడుతున్నారు. ఇంకొందరైతే జాబ్​ ఉంటుందా? పోతుందా? అనే కన్ఫ్యూజన్​లో పడిపోతున్నారు. మరికొందరు శాలరీ తగ్గించేస్తారేమో అని బెంగ పెట్టుకుంటున్నారు. ఇవన్నీ కరోనా వైరస్​ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది జనం ప్రస్తుతం ఫేస్​ చేస్తున్న భయాలు. సైకాలజిస్టులు ఏం చెబుతున్నారంటే కరోనా క్రైసిస్​ అనేది ఎకనామిక్, ఫైనాన్షియల్​ అస్థిరతకు దారి తీస్తోందని, దీని వల్ల చాలా మంది నార్మల్​ లైఫ్​ మారిపోతుందని, దాని ప్రభావం వారి మెంటల్​ హెల్త్​ పైనా పడుతుందని చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా లాక్​ డౌన్​ మొదలవ్వగానే గ్రాసరి షాపుల్లో సరుకులు కొనుగోలు చేసేందుకు జనం ఎగబడటం గురించి వారు ప్రస్తావిస్తున్నారు. వేరే వారి నుంచి వైరస్​ తమకు ఎక్కడ వస్తుందో అని చాలా మంది ఇప్పుడు అబ్రెసివ్​ కంపల్సివ్ డిజార్డర్(ఓసీడీ)కు గురవుతున్నారు.

మెంటల్​ హెల్తే మెయిన్​ రీజన్
జనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మెంటల్​ హెల్త్​కు సంబంధించినదే. ఇది అనేక రకాలుగా వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది. దీనికి మొదటి ఉదాహరణ వర్క్ ఫ్రం హోం. ఇంటి నుంచి పనిచేయడం చాలా సులువుగా ఉంటుందని మొదట ఎక్కువ మంది భావించారు. కానీ, రానురాను పరిస్థితులు దారుణంగా మారిపోతున్నాయి. ఆఫీస్​ టైమ్​ కంటే మించి ఎక్కువ సమయం ల్యాప్​ టాప్​లతో కుస్తీ పట్టాల్సి వస్తోంది. దీంతో తాము ఓవర్​గా వర్క్​ చేస్తున్నామనే ఫీలింగ్​ వారిలో కలుగుతోంది. కానీ బాస్​ గానీ, కో వర్కర్స్​ గానీ తాము పని చేస్తున్నామని గుర్తించే పరిస్థితి లేకపోవడం వారిలో అసంతృప్తిని కలిగిస్తోంది. ఒకవేళ ఏదైనా పనిలో ఉండి కాల్ కు గానీ, ఈ మెయిల్​కుగానీ రెస్పాండ్​ అవ్వలేదా.. పనిని సీరియస్​గా తీసుకోవడం లేదని కో వర్కర్స్ నుంచి వెక్కిరింపులు ఎదురవుతున్నాయి. వీటన్నిటి వల్లా పర్సనల్​ లైఫ్​ కూడా దెబ్బతింటోంది.

దెబ్బతింటున్న రిలేషన్స్
కరోనా ఎఫెక్ట్​ వల్ల చాలా మంది బలవంతంగా సెల్ఫ్ ఐసోలేషన్​ లో ఉండటంతో చాలా మందితో ఫిజికల్ రిలేషన్​ దెబ్బతింటోంది. ఒంటరితనం అనేది ప్రపంచంలో ఉన్న అతి పెద్ద రిస్క్ ఫ్యాక్టర్​ అని, ప్రస్తుతం దాని ప్రభావం చాలా ఎక్కువగా పెరుగుతోందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. మన వారికి దూరంగా ఉండటం కూడా చాలా ఇబ్బందులకు గురిచేస్తోంది. వీడియో కాల్స్​ వంటివి ఉన్నా.. అవి కొంత వరకే మనల్ని ప్రశాంతంగా ఉంచగలవు. ఐసోలేషన్​లో చాలా టైం ఉంటున్నా సరే మన వారితో గడిపే పరిస్థితి లేకపోవడం మెంటల్​గా టెన్షన్​ పెంచుతోంది.

కరోనా న్యూస్​కు దూరంగా ఉండాలి
కరోనా గురించిన వార్తలు చదవడం, చూడటం, వినడం సాధ్యమైనంత వరకూ తగ్గించాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. రోజుకు ఒకటి రెండు సార్లు మాత్రమే కరోనాకు సంబంధించి న్యూస్​ తెలుసుకోవాలని చెప్పారు. తరచు కరోనాకు సంబంధించిన వార్తలు తెలుసుకోవడం వల్ల ఆందోళన పెరుగుతుందంటున్నారు. ఈ టైమ్​లో చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెబుతున్నారు. కరోనా గురించి పెద్దవాళ్లు టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తే.. పిల్లలు కూడా నెర్వస్​ గా ఫీలవుతారని, లాంగ్ టర్మ్​లో చిన్నారులపై ఇది నెగెటివ్​ ప్రభావం చూపిస్తుందని చెప్పారు.

జాబ్ లాస్.. శాలరీ కట్ గురించే బెంగ
కరోనా వైరస్​ తగ్గిపోయినా ఆ తర్వాత తమ పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. కంపెనీల గ్రౌత్​ తగ్గిపోయి చాలా మంది జాబ్​ పోతుందని, శాలరీ తగ్గిపోతుందని ఆందోళన కనిపిస్తోంది. ఈ విషయంలో సాధ్యమైనంత వరకూ ట్రాన్స్​పరెంట్​గా ఉండటం మంచిదని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. రీజన్​ఏమిటనేది అందరికీ తెలిసిందే కాబట్టి ఈ విషయంలో గౌరవంగా వ్యవహరించాలని చెబుతున్నారు.