ఐపీఎల్ కామెంటేటర్‌‌‌‌ ఆకాశ్‌‌‌‌ చోప్రాకు కరోనా

ఐపీఎల్ కామెంటేటర్‌‌‌‌ ఆకాశ్‌‌‌‌ చోప్రాకు కరోనా

న్యూఢిల్లీ: మూడు సీజన్ల తర్వాత హోమ్‌‌‌‌ అవే ఫార్మాట్‌‌‌‌లో, ఫ్యాన్స్‌‌‌‌తో కిక్కిరిసిన స్టేడియాల్లో జరుగుతున్న ఐపీఎల్‌‌‌‌16లో తొలి కరోనా కేసు వచ్చింది. ఇండియా మాజీ క్రికెటర్‌‌‌‌,  లీగ్‌‌‌‌ కామెంటేటర్‌‌‌‌ ఆకాశ్‌‌‌‌ చోప్రా కరోనా పాజిటివ్‌‌‌‌గా తేలాడు. 45 ఏండ్ల చోప్రా డిజిటల్‌‌‌‌ బ్రాడ్‌‌‌‌కాస్టింగ్‌‌‌‌ కామెంటరీ ప్యానెల్‌‌‌‌లో ఉన్నాడు. 

తాను పాజిటివ్‌‌‌‌గా తేలిన విషయాన్ని ఆకాశ్‌‌‌‌ మంగళవారం ట్వీట్ చేశాడు. మరోసారి కరోనా సోకిందని, తక్కువ లక్షణాలు ఉన్నాయని తెలిపాడు. కోలుకొని తొందర్లోనే కామెంటరీ డ్యూటీలో జాయిన్‌‌‌‌ అవుతానని చెప్పాడు. 

కాగా, దేశంలో కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. కొత్తగా 3 వేల పైచిలుకు కేసులు వచ్చాయి. ఈ నేపథ్యంలో వేలాది మంది ఫ్యాన్స్‌‌‌‌ ఒక్క చోట చేరుతున్న ఐపీఎల్ విషయంలో  జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సూచించే చాన్స్‌‌‌‌ ఉంది.