నిజామాబాద్ జిల్లాలో కరోనా కలకలం

నిజామాబాద్ జిల్లాలో కరోనా కలకలం
  • మోడల్ స్కూల్ లో 10 మంది ఇంటర్ విద్యార్థినులు..
  • నలుగురు నర్సింగ్ విద్యార్థినులకు కరోనా

నిజామాబాద్ జిల్లా: కరోనా కేసులు మళ్లీ కలకలం సృష్టిస్తున్నాయి. తగ్గినట్లే తగ్గిపోయిన కరోనా కేసులు జిల్లాలో రోజు రోజుకూ బయటపడుతున్నాయి. దీంతో కరోనా జిల్లాలో పూర్తిగా కనుమరుగు కాలేదని తెలుస్తోంది. అసలే హాస్టళ్లలో భోజనాలు.. స్కూళ్లలో మధ్యాహ్న మధ్యాహ్న భోజనాలు సరిగా లేక అస్వస్థతకు గురవుతున్న ఉదంతాలు బయటపడుతూ కలకలం రేపుతున్న తరుణంలో తాజాగా కరోనా కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. జక్రాన్ పల్లి  మండలం మోడల్ స్కూల్  లో చదువుకుంటున్న ఇంటర్మీడియట్ విద్యార్థినులకు రెండు మూడు రోజులుగా అనారోగ్యాల బారిన పడ్డారు. చాలా మంది దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతుండడంతో స్కూల్ నిర్వాహకులు వైద్య సిబ్బందితో పరీక్షలు చేయించారు. మొత్తం 98 మంది విద్యార్థినులకు  కరోనా అనుమానిత లక్షణాలతో టెస్టులు చేయించడి 10 మంది ఇంటర్ విద్యార్థినులకు  కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో స్కూల్ మొత్తం శానిటైజ్ చేయించారు. 

నర్సింగ్ కాలేజీలో నలుగురికి..

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ నర్సింగ్ కాలేజీ లో కరోనా కేసులు నమోదయ్యాయి. కాలేజీలో పలువురు అస్వస్థతకు గురికావడంతో ముందు జాగ్రత్తగా విద్యార్థినులందరికీ వైద్య పరీక్షలు చేయించారు. వీరిలో నలుగురు విద్యార్థినులకు కరోన పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత వారం రోజులుగా కాలేజీని సందర్శించిన వారినందరినీ కరోనా పరీక్షలు చేయించుకుని తగిన వైద్య చికిత్సలు చేయించుకోవాలని కాలేజీ యాజమాన్యం కోరింది.