ఎన్ని కణాలుంటే వైరస్ సోకుతుందో తెలుసా..

ఎన్ని కణాలుంటే వైరస్ సోకుతుందో తెలుసా..

40 నుంచి 200 వైరస్ కణాలుంటేనే ఇన్ఫెక్షన్
వాటిని అడ్డు కోవాలంటే మాస్కులు కట్టుకోవాల్సిందే
జపాన్, సింగపూర్, సౌత్ కొరియాలను ఫాలో అవ్వాలంటున్న నిపుణులు

న్యూఢిల్లీ: మాస్కులు కట్టుకోవాలా? వైరస్ ను అవి అడ్డుకుంటాయా?.. చాలా దేశాల్లో దీనిపైనే చర్చ. అవసరం లేదని కొన్ని, కావాల్సిందేనని మరికొన్ని దేశాలు వాదిస్తున్నాయి. మన దగ్గరైతే చాలా రాష్ట్రాల్లో మాస్కుల్ని తప్పనిసరి చేశారు. లేకుండా బయటకు వెళ్తే ఫైన్లు వేస్తున్నారు. అవసరమైతే అరెస్ట్ చేసి లోపలేస్తున్నారు. మరి, నిజంగానే మాస్క్ అవసరమా.. అంటే అవసరమేనని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకకుండా అవి అడ్డుకుంటాయంటున్నారు. ‘‘కరోనా సోకిన వ్యక్తికి చెందిన మిల్లీ లీటర్ ఉమ్ములో కోట్లాది వైరస్ కణాలుంటాయి. ఆ వ్యక్తి తుమ్మినప్పుడు అవి గాల్లో కలుస్తాయి. ఒక్క వైరస్ తో ఇన్ఫెక్షన్ రాదు. ఇన్ఫెక్షన్ రావాలంటే కనీసం 40 నుంచి
200 వైరల్ పార్టికల్స్ కావాలి’’ అని హాంకాంగ్ వర్సిటీ మైక్రోబయాలజీ ప్రొఫెసర్ యువాన్ క్వాక్ యంగ్ చెప్పారు. కరోనా సోకిన వ్యక్తుల నుంచి ఇతరులకు వైరస్ సోకకుండా ఉండాలంటే మాస్కులు తప్పనిసరిగా కట్టుకోవాలన్నారు. వైరస్ ఒంట్లోకి రాకుండా ఎన్95 మాస్కులు సమర్థవంతంగా అడ్డుకుంటాయని చెప్పారు. అవి లేకుంటే సర్కజిల్ మాస్కులైనా ఫర్వాలేదన్నారు. వీటి ప్రభావం తక్కువే అయినా వాటిల్లోవాటర్ రిపెల్లెంట్ లేయర్ ఉంటుందని, అది వైరస్ ను లోపలికి రానివ్వదని చెప్పారు. తైవాన్, సౌత్ కొరియా, జపాన్, సింగపూర్ వంటి దేశాల్లో గతంలో ఇలాంటి గత్తర్లు రెండుసార్లు వచ్చాయని క్వాక్ యంగ్ అన్నారు. ఆ దేశాల్లో మాస్కులు కట్టుకునేలా ప్రజలను ప్రోత్సహించగా జనమూ పాటించారని, మంచి ఫలితాలొచ్చాయని వివరించారు.

For More News..

న్యూయార్క్ లో ఏం జరుగుతుంది? కరోనా మరణాలు అక్కడే ఎందుకు ఎక్కువ?

రాష్ట్రంలో 500 దాటిన చేరిన కరోనా కేసులు

లాక్ డౌన్ ఎత్తేయాలంటే ఈ ఆరు ఖచ్చితంగా చేయాలి..