పెళ్లిలో కరోనా పంజా.. 86 మందికి పాజిటివ్

పెళ్లిలో కరోనా పంజా.. 86 మందికి పాజిటివ్

తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. రోజు వారీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. పెళ్లిల్లు,ఫంక్షన్లు, దావత్ లు పలు కార్యక్రమాల వల్ల కరోనా కేసులు పెరుగుతున్నాయి. లేటెస్ట్ గా నిజామాబాద్ జిల్లా వర్ని మండలం  సిద్దాపూర్ గ్రామంలో పెళ్ళికి హాజరైన వారిలో 86 మందికి పాజిటివ్ వచ్చింది. వందలాది మంది పెళ్లికి హాజరవ్వగా వీరిలో370 మందికి కరోనా టెస్టులు చేయగా 86 మందికి పాజిటివ్ వచ్చింది. ఇంకా మిగిలిన వారికి టెస్టులు చేస్తున్నారు.