
బీసీ సంక్షేమ మంత్రి గంగుల కమలాకర్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు గంగుల స్వయంగా ట్వీట్ చేశారు. కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా ఐసోలేట్ కావాలని.. కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. గత కొద్ది నెలలుగా హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటున్న గంగుల.. నిన్న(సోమవారం) వేలాది మందితో పెంచికల్ పేట లో మున్నూరు కాపు ఆత్మీయ సత్కారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గంగులతో పాటు మంత్రి హరీశ్ రావు,పలువురు ఎమ్మెల్యేలు,నాయకులు పాల్గొన్నారు.