నారా లోకేశ్కు కరోనా 

V6 Velugu Posted on Jan 17, 2022

అమరావతి : కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ వేదికగా తెలిపారు. వైరస్ నుంచి కోలుకునే వరకూ సెల్ఫ్ ఐసోలేట్ అవుతానని చెప్పారు. ‘‘నాకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలేమీ లేవు. బాగానే ఉన్నాను. కానీ నేను కోలుకునే వరకూ సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటాను. నన్ను కలసిన వారంతా వెంటనే టెస్టులు చేయించుకుని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ సేఫ్‌గా ఉండాలి" అని లోకేశ్ ట్వీట్ చేశారు. 

 

Tagged TTD, corona, Nara Lokesh, Positive,

Latest Videos

Subscribe Now

More News